అంగన్వాడీల సమ్మె శుక్రవారం 32వ రోజుకు చేరింది. ఇన్నాళ్లుగా తమ సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు వెనక్కు తగ్గేదేలేదని స్పష్టం చేశారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద రిలేదీఓలు కొనసాగించారు. పలమనేరులో శిబిరం వద్ద కూర్చుని నిరసన తెలిపారు. వీరికి జనవిజ్ఞాన వేదిక మద్దతు పలికింది.