నూజివీడు పరిధిలోని గొల్లపల్లిలో సిటీ కేబుల్ నిర్వహణలో పనిచేస్తున్న రాజేష్(36) కేబుల్ వైర్లను లాగుతున్న తరుణంలో శుక్రవారం 11 కేవీ విద్యుత్ లైన్ స్తంభంపైకి ఎక్కాడు. ఈ క్రమంలో అతను విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. రాజేష్ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి రూరల్ ఎస్సై టి.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.