ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం క్యాంప్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన తనయుడు (వైయస్ఆర్సీపీ ఏలూరు లోక్సభ ఇన్ఛార్జి) కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ఏలూరు లోక్సభ సమన్వయకర్తగా నియమించడం పట్ల సీఎం వైయస్ జగన్కు సునీల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి వైయస్ జగన్ను సత్యవేడు ఎమ్మెల్యే (తిరుపతి వైయస్ఆర్ సీపీ లోక్సభ ఇన్ఛార్జి) కోనేటి ఆదిమూలం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.