భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. తల్లిదండ్రుల ఆస్తుల్లో కొడుకులతో సమానంగా కూతుర్లకు కూడా హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వారసత్వ ఆస్తుల్లో ఆడపిల్లలకు సమాన హక్కు ఉంటుందని తేల్చింది.
హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 ప్రకారం తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెలకు కూడా సమాన హక్కులుంటాయని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. తండ్రి మరణించినప్పటికి కుమార్తెలకు సోదరులతో సమానంగా ఆస్తి హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.