ముత్యాల ముగ్గులు, మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం వైయస్ జగన్కు ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలుత సీఎం వైయస్ జగన్, భారతమ్మ దంపతులు సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయటంతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. అనంతరం బసవన్నలకు సారెను సమర్పించారు. అనంతరం గోపూజ కార్యక్రమంలో వారిరువురూ పాల్గొన్నారు.ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు కూడా ఏర్పాటుచేశారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు.