సాధారణంగా ఉత్తర యూరప్‌లో వర్షం పడే వాతావరణం ఉంటుంది. అక్కడ వర్షాలు బాగానే పడతాయి. కానీ, ఎక్కువ వర్షం పడే ప్రాంతాల్లో మాత్రం యూరప్ లేదు. భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ వర్షం పడుతోంది.
ఏటా 3000 మి.మి వర్షంతో కొలంబియా భూమిపై అత్యంత వర్షం పడే దేశంగా ఉంది. దీని తర్వాత సావో టోమ్, ప్రిన్సిప్, పాపువా న్యూగినియా ఉన్నాయి. ఈ ప్రాంతాలను చూసేందుకు ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.