నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని తన స్వగ్రామంలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎంపీటీసీ మాజీ సభ్యుడు ముత్తుముల సంజీవరెడ్డి నివాసంలో శనివారం మండలస్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. తమ కుటుంబం కార్యకర్తలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటుందన్నారు. కార్యకర్త లకు సమస్యలు వస్తే ఎంతవరకైనా వెళ్లి పోరాడతానని వారిలో ఉత్తేజం నింపారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలోనే కొమరోలు మండలంలో అధిక ఓట్లు టీడీపీ కి పడాలన్నారు. ప్రస్తుతం పార్టీలో ఎవరైతే క్రియాశీలకంగా వ్యవహరిస్తారో వారికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామాల్లో కుటుంబ సాధికారక కమిటీ సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. గ్రామాల్లోని 30 కుటుంబాలకు ఇద్దరు కుటుంబ సాధికార కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలిపారు. వారి పరిధిలోని అన్ని గృహాలకు ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ బాండ్లు అందజేయాలన్నారు. ముఖ్యం గా మహిళలకు మహాశక్తి, రైతు పధకాలు, యువగళం, బీసీ రక్షణ చట్టం, ఇంటింటికి సురక్షిత మంచినీరు, పూర్ టూ రిచ్ వంటి పథకాలను చంద్రబాబు నాయుడు పొందుపరి చారన్నారు. వాటివల్ల ఒక్కో కుటుంబానికి చేకూరే లబ్ధిని వారికి వివరించాలన్నారు. కార్యాక్రమంలో జిల్లా రైతు కార్యదర్శి వీవీ రాఘవరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు ముత్తుముల సంజీవరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు బిజ్జాల తిరుమలరెడ్డి, జిల్లా రైతు నాయకులు బిజ్జం రవింద్రారెడ్డి, మాజీ సోసైటీ అద్యక్షులు పులకుర్తి వెంకటేశ్వర్లు, కో-ఆప్షన్ మాజీ సభ్యుడు షేక్ నబీ, మాజీ సర్పంచ్ అబ్ధుల్ ఖాదర్, నాయకులు కృష్ణమోహన్‌రెడ్డి, బాలిరెడ్డి, వేణమ్మ, గంగయ్య, నాగేశ్వరరెడ్డి, డి శ్రీనివాసరెడ్డి, మైలగాని సత్యం, లక్ష్మినరసయ్య, జ్యోతిరెడ్డి, గోడి ఓబుల్‌రెడ్డి, గోపాలకృష్ణయ్య, శ్రీనివాసచౌదరి, రఘవర్మరాజు, దనిరెడ్డి మోహన్‌రెడ్డి, లాయర్ విజయ్‌కుమార్‌రెడ్డి, లక్ష్మిరంగారెడ్డి, యల్లారెడ్డి, గురుస్వామిరెడ్డి, దూదేకుల రంతూ, బోడ్డు రంగయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.