సంక్రాంతి అనగానే కోడిపందేలు గుర్తు వస్తాయి. కానీ, ఉమ్మడి విశాఖ జిల్లాలో సంక్రాంతికి గుర్రాల పోటీలు ఎంతో ప్రత్యేకం. పండుగ పూట మునగపాక చుట్టుపక్కల గ్రామాల్లోనూ సరదాగా గుర్రపు పోటీలు నిర్వహిస్తుంటారు.
అంతరించిపోతున్న సాంప్రదాయాలను పరిరక్షించుకునేందుకే పండుకో పూట సరదాగా పోటీలు నిర్వహిస్తున్నామని అక్కడి ప్రజలు చెబుతున్నారు.