కనుమ పండుగనాడైన నేడు అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభల ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ప్రభల తీర్థాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు.
జగ్గన్నతోటలో కొలువుకానున్న ఏకాదశ రుద్రులను దర్శించుకునేందుకు ఎడ్ల బండ్లపై రావడం ఇక్కడి ప్రత్యేకత. ఎగువ కౌశిక నదిలో నుంచి పీకల్లోతు నీటిలో మునిగి ప్రభలను భుజాలపై మోసుకుని వచ్చే అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది.