కనుమ రోజున ఎద్దులను పూజించడంతో ఆ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉంచాలనే గొప్ప భావనతో బళ్లు కట్టకుండా చూసేందుకు ఆ రోజు ప్రయాణమే వద్దని పూర్వీకులు చెప్పేవారు.
ఏడాదిలో ఒక్కరోజైనా ఎద్దులకు విశ్రాంతి ఇవ్వాలనే గొప్ప ఉద్దేశం ఈ మాట వెనుక ఉంది. కనుమ రోజున బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించాలని కొందరు చెబుతుంటారు.