హనుమంతునిపాడు మండలం వేములపాడులో కరెంట్ షాక్తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వేములపాడు గ్రామానికి చెందిన కంపెని పిచ్చయ్య కుమారుడు బాల కాశయ్య (24) పొలంలో విద్యుత్తు మోటారు వద్దతీగలు సరిచేస్తున్నారు. ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా కావడంతో షాకు కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కనుమ పండుగ రోజు ఆ గ్రామంలో విషాదఛాయలు ఆలుముకున్నాయి.