ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం లెళ్ళపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి పూరిళ్లు దగ్ధమైన సంఘటన తెలిసిందే. విషయం తెలుసుకున్న వైసిపి నియోజకవర్గ ఇంచార్జ్ తాడిపర్తి చంద్రశేఖర్ బాధితులను మంగళవారం రాత్రి పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 15వేలు చెప్పున నిత్యావసర సరుకులతో మొత్తం కలిపి సుమారు లక్ష రూపాయలు అందించారు. అలాగే కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైసిపి నాయకులు పాల్గొన్నారు.