భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణ సమాచారం అందించేందుకు 'హర్‌హర్ మౌసం.. హర్‌ఘర్ మౌసం' పేరిట కొత్త యాప్‌ను ఆవిష్కరించింది.
దీన్ని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రంలోనూ ఈ యాప్‌ని ఉన్నతాధికారులు విడుదల చేశారు. ఇక ఈ యాప్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.