టీడీపీ నేత పట్టాభి ఏపీ పెట్టుబడులపై కీలక వ్యాఖ్యలు చేశారు. '2015 జనవరిలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ విజన్ ఎలా ఉండబోతుందో ఆ సదస్సులో చంద్రబాబు వివరించారు.
'2016, 2017లో వరుసగా దావోస్ సదస్సుకు చంద్రబాబును ఆహ్వానించారు. ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా 2015 నుంచి 2019 వరకు ఏటా సదస్సుకు హాజరయ్యారు. అనేక కంపెనీలతో మాట్లాడి ఏపీ రాష్ట్రానికి వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చార'న్నారు.