ఇటీవల రోడ్లపై యువతులు గొడవలు పడి, ఒకరినొకరు కొట్టుకొని విమర్శల పాలైన ఘటనలు సోషల్ మీడియాలో చాలానే చూసి ఉంటాం. అలాంటి ఘటనలు చూసి కూడా కొందరిలో మార్పు రావడంలేదు.
తాజాగా యూపీలోని లక్నో సిటీలో సమ్మిట్ బిల్డింగ్ సమీపంలో రాత్రి సమయంలో కొందరు యువతులు గొడవపడ్డారు. అందరూ చూస్తుండగా ఒకరిపై ఒకరు దుర్భాశలాడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో వీరు చదువుకున్న మూర్ఖులు అంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.