నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19 నుంచి 27వ తేదీ వరకు రెండు ఫేజ్ లుగా జరగనున్న మిలాన్ - 2024 వేడుకలను విజయ వంతంగా నిర్వహించాలని సంబంధిత ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున సూచించారు.
స్థానిక వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో నేవీ, ఎయిర్ పోర్టు, కస్టమ్స్, రెవెన్యూ, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, పోలీసు, పర్యాటక శాఖ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.