అయోధ్య భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్యను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లే అవకాశం ఉండటంతో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.
జనవరి 29 తర్వాత తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట రైల్వేస్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఏపీలోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, సామర్లకోట నుంచి అయోధ్యకు స్పెషల్ రైళ్లను రైల్వే శాఖ నడపనుంది.