‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద లబ్ధిదారులకు బ్యాంక్ వడ్డీ రీయింబర్స్మెంట్ నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.
తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద రూ.46.90 కోట్ల నగదును బటన్ నొక్కి సీఎం జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. అక్కచెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందన్నారు.