టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభను ఉద్దేశిస్తూ.. టీడీపీ వర్ధంతి చేసి, చంద్రబాబు పిండం పెట్టాడని విమర్శించారు.
పేదల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని నాని సవాల్ విసిరారు. తాను ప్రజలకోసం చావటానికైన సిద్ధంగా ఉన్నానని, చంద్రబాబు ఉడత ఊపుడికి భయపడనన్నారు.