YSR పింఛను కానుక కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 66.34 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని జగన్ ప్రభుత్వం తెలిపింది. 2.6 లక్షల మంది వాలంటీర్ల ద్వారా ప్రతి నెలా 1-5వ తేదీలోపు పంపిణీ చేస్తున్నామని తెలిపింది.
‘గతంలో వృద్ధులు పింఛను పొందేందుకు 65 ఏళ్లు ఉన్న అర్హత వయసును 60 ఏళ్లకు తగ్గించాం. ఒకే కుటుంబంలో అన్ని రకాల దివ్యాంగుల, ఆరోగ్య, ఆర్ట్ పింఛన్లకు రెండో పింఛను పొందేందుకు అర్హత ఉంది’ అని పేర్కొంది.