మీరు హ్యాకింగ్‌ను నివారించాలనుకుంటే *401#99963….45 (ఏదైనా నంబర్)కు కాల్ చేయాలని, లేకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందని మెసేజ్ వస్తుంది. అలా చేస్తే మీరు ఫోన్‌లో ఏమి చేస్తున్నారో హ్యాకర్ లేదా స్కామర్ తెలుసుకోవచ్చు.
మీ ఫోన్ కు ఓటీపీని నిలువరించి, మీ బ్యాంకు పూర్తి వివరాలు తెలుసుకుని మోసం చేస్తారు. అటువంటి మెసేజీలకు రిప్లై ఇవ్వవద్దని, ఎటువంటి లింకులపై క్లిక్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది.