బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులుగా ఉన్న 11 మందికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదివారంలోగా అందరూ సరెండర్ అవ్వాలని శుక్రవారం న్యాయస్థానం ఆదేశించింది. అయితే లొంగిపోవడానికి మరింత సమయం ఇవ్వాలని దోషులు కోర్టును అభ్యర్థించారు. కానీ వారి అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. 2002 గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోను రేప్ చేసిన ఆరోపణలపై నిందితులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.