దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. సీఎం వైయస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున పెట్టారు.. 400 కోట్ల రూపాయలకు పైగా నిధులతో భారతదేశం గర్వ పడేలా విగ్రహం ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. సమాజంలో అసమానతలు పోగొట్టాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కన్న కలలు రాష్ట్రంలో నిజం అయ్యాయని మంత్రి చెప్పారు. అంబేద్కర్ ఆశయాల ప్రకారం ఏపీలో ప్రజలకు సంక్షేమ అభివృద్ది కొనసాగుతుందని మేరుగు నాగార్జున వెల్లడించారు.