చంద్రబాబు పరిపాలనలో దళితుల్ని నీచంగా చూశారు. చాలా దారుణంగా మాట్లాడారు మేరుగ నాగార్జున అన్నారు. అయన మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని, మా కులప్రస్తావనల్ని తెచ్చి మా కులాల్లో ఎవరూ పుట్టకూడదని చంద్రబాబు అన్నాడు. మా దళిత జాతి అంతుచూస్తానన్నాడు. మరీ దారుణమైన విషయం ఏమిటంటే.. అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన చట్టాలను ఆయన చుట్టాలుగా వాడుకుని మా మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, వెలివేతలకు పాల్పడ్డాడు. దళిత మహిళల్ని వివస్త్రలను చేయించాడు. ఇంత నీచమైన ఘటనలకు పాల్పడిన ఆయన.. ఏనాడూ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటుకు పూనుకోలేదు. ఐదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యవాదులంతా ఆరాధ్యదైవంగా పూజించే అంబేద్కర్ మహాశయుని విగ్రహం పెట్టాలనే కనీస ఆలోచన కూడా చేయలేదు అని అన్నారు.