దేశమంతా అయోధ్య రామ మందిర ప్రారంభ వేడుక చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 22న రామమందిరం ప్రారంభోత్సవానికి అన్ని రాష్ట్రాలు సెలవులు ప్రకటించారని... కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్లో హిందువుల మనోభావాలు కాపాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్కు ఉందన్నారు. 22న తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.