పశ్చిమ రష్యాలోని చమురునిల్వ డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడటంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 60కి.మీ. దూరంలో ఉన్న క్లింట్సీలో జరిగిన ఈ దాడిలో మొత్తం 6వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన నాలుగు చమురు రిజర్వాయర్లు అగ్నికి ఆహుతయ్యాయి. మార్చి 17న రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి పౌరులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది.