అయోధ్యలో జరుగుతున్న రామ్‌లల్లా పట్టాభిషేక మహోత్సవం నేడు ఐదో రోజుకు చేరుకుంది. నేటి అనుష్ఠాన కార్యక్రమం ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. రామాలయంలోని గర్భగుడిని సరయూ పవిత్ర జలంతో శుద్ధి చేసి, వాస్తు శాంతి, ‘అన్నాధివాసం’ కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శకరాధివాసం, ఫలాధివాసం, పుష్పాధివాసం మొదలైన అనుష్ఠానాలు జరగనున్నాయి. పంచదారలో, పండ్లలో, పుష్పాలలో బాలరాముని విగ్రహాన్ని కొంతసేపు ఉంచుతారు.