అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట వేళ.. ఆధ్యాత్మికం పేరిట ఆన్లైన్లో నకిలీ ఉత్పత్తుల హవా నడుస్తోంది. అయోధ్య పేరిట నకిలీ ప్రసాదం అమ్మకాలు చేపట్టిందన్న ఆరోపణల మేరకు అమెజాన్ సంస్థకు నోటీసులు జారీ అయ్యాయి.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఫిర్యాదు నేపథ్యంలో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) అమెజాన్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. అయోధ్య రామ్ మందిర్ ప్రసాద్ పేరిట అమెజాన్‌లో అమ్మినట్లు తెలుస్తోంది.