అరుకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో శనివారం జరిగిన చంద్రబాబు నాయుడు సభకు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి నాయకులు తరలి వెళ్లారు. పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిలు సంధ్యారాణి, జగదీశ్వరి, జయకృష్ణ తోపాటు పలువురు నాయకులు సభకు వెళ్లారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలపై చంద్రబాబుకు విన్నవించినట్లు పోలిట్ బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి తెలిపారు.