ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22న కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమసమస్యలను వినతుల రూపంలో అందజేసి పరిష్కరిం చుకోవాలన్నారు. ఉదయం 10. 30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్పందన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. జిల్లాఅధికారులు స్పందన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని, గైర్హాజరైతే శాఖాపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.