తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడి యూనియన్ తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమానికి చిలమత్తూరు మండలం నుంచి అంగణవాడీ కార్యకర్తలు సోమవారం పెద్ద ఎత్తుర తరలివెళ్లారు. ఛలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ఒక పక్క పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఎక్కడికక్కడ యూనియన్ నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు. అయినా చిలమత్తూరుకి చెందిన కార్యకర్తలు పోలీసుల కన్ను కప్పి ఛలో విజయవాడకు బయలుదేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa