ఏపీలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (హిందూ) ఫీజులను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సాధారణ వివాహ నమోదు ఫీజు రూ.200 ఉండగా.. రూ.500కు పెంచింది.
వివాహ వేదిక వద్దకే సబ్ రిజిస్ట్రార్ వస్తే ఫీజును రూ.5,000 (గతంలో రూ.210) చేసింది. ప్రభుత్వ సెలవు రోజుల్లో వివాహాల నమోదు ఫీజును రూ.5,000గా నిర్ణయించింది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రికార్డుల పరిశీలన ఫీజును రూపాయి నుంచి రూ.100కు పెంచింది.