మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 27 నుంచి 31వ తేదీలోపు జోనల్ ఆఫీస్‌కు రావాలని ఈడీ పేర్కొంది.
ఇదే కేసులో ఈ నెల 20న ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించగా.. మరోసారి ప్రశ్నించాల్సి ఉందని తాజాగా నోటీసులు జారీ చేసింది. జార్ఖండ్‌లో భూమి యాజమన్యాన్ని అక్రమంగా మార్చే భారీ మాఫియాకు సంబంధించిన స్కామ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తోంది.