రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 'ఫ్యూచర్ స్కిల్స్' అమలుకు ఉన్నత స్థాయి కమిటీ, మిషన్ డైరెక్టర్‌ను నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం..
కమిటీకి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మిషన్ డైరెక్టర్‌గా పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు రామలింగం నియమితులయ్యారు. కాగా, 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఫ్యూచర్ స్కిల్స్‌ను అమలు చేయనున్నారు.