సమాజంలోని ఆడపిల్లలందరూ సామాజిక అవగాహన పెంపొందించుకొని విద్య ఆరోగ్యం మొదలైన రంగాలలో మరింతగా ఎదగాలని ఉరవకొండ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం వీరన్న పేర్కొన్నారు. బుధవారం పాఠశాల నుండి పట్టణంలో ర్యాలీ చేపట్టి జాతీయ బాలిక దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా బాలికలు తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ముందుకు అడుగులు వేయాలని అన్నారు. ఐసిడిఎస్ సూపర్వైజర్లు, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.