ఏపీలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దెందులూరు మండలాల్లో పెద్దపులి సంచరిస్తుండటంతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. ఆవులపై పులి దాడి చేసిందని స్థానికులు తెలిపారు. పాదముద్రల ఆధారంగా పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.