యూపీలోని లక్నో ఫ్యామిలీ కోర్టులో విచిత్రమైన విడాకుల కేసు వచ్చింది. బహ్రైచ్ యువతికి 2019లో పెళ్లి జరిగింది. ఓ రోజు భర్తతో పాటు తన స్నేహితురాలి ఇంటికి ఆమె వెళ్లింది. పరస్పరం అంగీకారంతో వారు తమ భర్తలను మార్చుకున్నారు. కొంతకాలం వీరి సంబంధాలు సజావుగానే ఉన్నాయి. అయితే భర్త తన స్నేహితురాలిని పెళ్లి చేసుకోవడం ఆమెకు నచ్చలేదు. దీంతో భర్తపై ఆమె కేసు పెట్టింది. ఆమె భర్త కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు.