AP: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కష్టాలతో పాటు, కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 పెట్రోల్ బంకులు మూతపడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలు వస్తున్నాయి. సరఫరాలో జాప్యం, అధిక వినియోగం వంటి కారణాలతో కొరత ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. బుధవారం నుంచి సరఫరా మెరుగుపడి ఇబ్బందులు తొలగిపోతాయని డీఎస్ఓ ఎం. రాజారఘువీర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa