పల్నాడు జిల్లా మాచర్లలో ఆన్లైన్ బెట్టింగులకు బానిసైన నల్లపాటి వంశీ (17) అనే ఇంటర్ విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. కొంతకాలంగా బెట్టింగుల్లో డబ్బులు కోల్పోతూ, ఇటీవల తల్లి ఫోన్‌లో ఉన్న సుమారు రూ. 3 లక్షలు కూడా వినియోగించినట్లు తెలిసింది. తల్లి ప్రశ్నించగా బాలుడు రెండు రోజుల క్రితం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa