ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నెక్ట్స్ లెవల్లో ఫైర్ అయ్యారు. సీఎం జగన్ అసలు తన అన్నే కాదని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తాను పులివెందుల పులిబిడ్డనని, ఎవ్వడికి భయపడనని.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఘాటైన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులపై మండిపడ్డారు. తీవ్ర పదజాలంతో జగన్పై విరుచుకుపడ్డారు. ఇక సాక్షి అంశాన్ని ప్రస్తావించిన వైఎస్ షర్మిల.. ఆ సంస్థలో తనకూ వాటా ఉందన్నారు. సోమవారం నాడు వైఎస్ షర్మిల కడప జిల్లాలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆమె.. సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు తనపై చేస్తున్న కామెంట్స్, విమర్శలు, ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. జోకర్ గాళ్లను తనపై ఉసిగొలిపారని, ఎవరు ఏం చేసినా అదిరేది.. బెదిరేది లేదన్నారు షర్మిల. సభా వేదికగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ... సీఎం జగన్ నా అన్నే కాదు..‘జగన్తో నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. రక్త సంబంధమే ఉంది. అయితే, జగన్ సీఎం అయ్యాక మారిపోయాడు. ఇప్పుడున్న ఈ జగన్.. నా అన్న కానే కాదు. వైసీపీలో జగన్ రెడ్డి సైన్యం నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. వైసీపీలో రోజుకొక జోకర్ గాడు నాపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మహిళను అని కూడా చూడకుండా నాపై దిగజారి మాట్లాడుతున్నారు.’ అంటూ వైసీపీ శ్రేణులపై ఫైర్ అయ్యారు షర్మిల.