రాజోలు ముంపు బాధితులకు అండగా ఉంటానని జమ్మలమడుగు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ రెడ్డి పేర్కొన్నారు. రాజోలి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పరిహారం కోసం సోమవారం పాదయాత్ర చేపట్టారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మధ్య పెద్దముడియం చేరుకున్నారు. పాలూరు, చిన్నముడియం, ఘర్షలూరు గ్రామాల మీదుగా నెమల్లదిన్నె గ్రామంలో బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ. ముంపువాసుల పరిహారం సాధించే విషయంలో వారికి అండగా ఉంటామన్నారు.