ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మూడు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
శాసనసభలో కీలక నిర్ణయాలను అకౌంట్ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది కాబట్టి ఎన్నికలకు ముందు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వ చివరి సమావేశాలు కాబట్టి.. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అలాగే వచ్చే ఎన్నికలకు అనుగుణంగా పలు ప్రభుత్వ నిర్ణయ పథకాలను అసెంబ్లీ వేదికగా జగన్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.