ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం తాగి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ భీమిలిలో 40 వేల మంది పట్టే స్థలంలో ‘సిద్ధం’ సభ నిర్వహించి నాలుగు లక్షల మంది వచ్చారని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా పోరు కార్యక్రమంలో జగన్ చేసిన దుర్మార్గాలను ఎండగడతామన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ.. 25 లోక్ సభ నియోజకవర్గాలలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కార్యాలయాలను ప్రారంభించామన్నారు. రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని సీతారామాంజనేయ చౌదరి పేర్కొన్నారు.