రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇస్మాయిల్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జిల్లా, రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు పంపారు. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఇస్మాయిల్ పార్టీలో తన స్థాయికి తగ్గ స్థానం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.