ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్ అడవిలో గురువారం సాయంత్రం ఘాట్ రోడ్డును దాటుతూ మూడు చిరుతలు ప్రత్యక్షమైనట్లు పర్యాటకులు, మదనపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి మదనమోహన్రెడ్డి వెల్లడించారు. ఒకే రోజు మూడు చిరుతలు రోడ్డుపక్కనే కనిపించడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. చిరుతల సంచారంపై పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.