తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ ఇంటిలో కిరాయికి ఉండే వారి బెడ్ రూమ్లో ఓనర్ కొడుకు స్పై కెమెరా అమర్చాడు. దీంతో ఆ ఇంట్లో ఉన్న మహిళకు అనుమానం వచ్చింది.
కెమెరా గురించి భర్తను అడిగింది. అది రికార్డర్ అని భార్యకు చెప్పాడు. అందులోని వీడియో ఫుటేజీ చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేసి ఇంటి యజమాని కుమారుడు ఇబ్రహీం, డెంటల్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.