హిందూపురం పట్టణంలోని రహమత్పురం 16వ వార్డుకు చెందిన జబీవుల్లా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వైఎస్సార్ బీమా పథకం ద్వారా మృతుడి కుటుంబానికి రూ. 90 వేలు మంజూరయ్యాయి. గురువారం 16వ వార్డు ఇన్చార్జి ఫరూక్ బీమా ప్రొసీడింగ్ పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇంతకు ముందు వైఎస్సార్ బీమా తక్షణసాయం కింద ప్రభుత్వం రూ. 10 వేలు అందసిందని తెలిపారు.