గార్లదిన్నె మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య అధ్యక్షతన శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీయార్ స్థానిక సంస్థలలో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తే దానిని చంద్రబాబు గారు 34 శాతంనకు పెంచారని తెలిపారు.