అమెజాన్ అడవి ప్రపంచంలోనే అతిపెద్ద అడవి. ఇక్కడి నుంచే ప్రపంచానికి 20 శాతానికి పైగా ఆక్సిజన్ అందుతోంది. సుమారు 2 వేల ఏళ్ల కిందట ఇక్కడ పురాతన నాగరికతలు వర్ధిల్లేవి.
ఆనాటి ప్రజలు ఈ అడవిలో ఆవాసం ఏర్పరుచుకున్నారు. ఈక్వడార్‌లోని అమెజాన్ అటవీ ప్రాంతంలో పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలు డ్రోన్ ద్వారా ఈ నగరాలను కనుగొన్నారు. ఆండెస్ పర్వతాలకు దిగువన ఉపానో లోయలో బయటపడిన ఈ పురాతన నగరం ఫొటోలు వైరల్ అయ్యాయి.