ఏపీలో ఓటర్ల తుది జాబితాలోనూ నకిలీ ఓట్లు వెలుగుచూశాయి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో నకిలీ ఓట్లను గుర్తించారు. కాణిపాకం దేవస్థానం ఈవో వెంకటేశ్వర్లు కుటుంబం పేరుతో ఎస్సీ కాలనీలో మూడు ఓట్లు ఉన్నట్లు తెలిసింది.
అయితే కాణిపాకం ఆలయ క్వార్టర్స్‌లో ఈవో కుటుంబం నివాసం ఉంటోంది. క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నా.. ఎస్సీ కాలనీలో ఓట్ల నమోదుపై టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.